‘మిరాయ్’కీ అదే కాన్ఫిడెన్స్.! తేజ సజ్జా తగ్గేదేలే.!
- August 27, 2024కుర్ర హీరో తేజ సజ్జాకి ‘హనుమాన్’ కెరీర్ బిగ్గెస్ట్ హిట్. అనూహ్యమైన విజయం దక్కింది ఆ సినిమాతో తేజ సజ్జాకి. నిజానికి ఆ సినిమా రిలీజ్ చేసుకునేందుకు ‘హనుమాన్’ టీమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అందరికీ తెలిసిందే.
అసలు ధియేటర్లే ఇవ్వలేదు. కట్ చేస్తే, సూపర్ డూప్ హిట్.. బాక్సాఫీస్‌కి కాసుల వర్షం కురిపించిందీ సినిమా. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ లిస్టులో ‘హనుమాన్’ వుంటుంది.
ఇక వచ్చే ఏడాదిలో చాలానే పెద్ద సినిమాలున్నాయ్. అందులో ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ ‘రాజాసాబ్’ కూడా వుంది. ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అయితే, తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా కూడా అదే నెలలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
ఏప్రిల్ 18న ‘మిరాయ్’ రిలీజ్ కానుంది. కాగా, ‘మిరాయ్’కీ ధియేటర్ల విషయంలో అలాగే చేస్తారా.? అంటే ఏమో చెప్పలేం అలాగే చెయ్యొచ్చు. కానీ, తేజ సజ్జా మాత్రం ఎలాంటి బెరుకూ లేకుండా నాకు తగ్గ ధియేటర్లే నాకు దక్కుతాయ్.
ఖచ్చితంగా మళ్లీ హిట్టు కొడతాం అంటూ బీభత్సమైన నమ్మకంతో వున్నాడు తేజ. ‘హనుమాన్’ ఊపులోనే ‘మిరాయ్’ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. మామూలు రెస్పాన్స్ రాలేదీ సినిమాకి. సో, అదే నమ్మకం, అదే ధైర్యంతో తేజ ‘మిరాయ్’ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నాడు. చూడాలి మరి, తేజ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో.?
తాజా వార్తలు
- ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల..
- టికెట్ చార్జీలు పెంచలేదు: విసి సజ్జనార్
- ఎనిమిది యూరోపియన్ దేశాలకు చైనా 'వీసా-ఫ్రీ ఎంట్రీ'
- రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో లేఖ
- కువైట్ హెల్త్ మినిస్ట్రీలో 12వేల మంది వైద్యులు..నివేదిక
- డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- ఒమన్‌లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!