‘కన్నప్ప’ నుంచి మరో కొత్త పోస్టర్.! ఈ సారి ఎవరిదో తెలుసా.?
- August 27, 2024
మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ మూవీ ‘కన్నప్ప’ నుంచి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ కిక్కిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ క్యారెక్టర్లు, డిఫరెంట్ ఆర్టిస్టులూ.. డిఫరెంట్ నేమ్స్.. ప్రతీ పోస్టరూ ఆసక్తికరంగానే అనిపిస్తోంది.
తాజాగా ‘తిన్నడు’ అనే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాత్ర పోషిస్తుందెవరో కాదు, మంచు విష్ణు ముద్దుల తనయుడు అప్రమ్. ఈ తిన్నడే పెద్దయ్యాకా కన్నప్పగా మారతాడు. అదే లీడ్ రోల్ మంచు విష్ణు పోషించే పాత్ర.
ఈ పాత్రలో అప్రమ్ చాలా మెచ్చూర్డ్‌గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ టైమ్ కెమెరాని ఫేస్ చేస్తున్నాడు. అయినా చాలా కాన్ఫిడెంట్‌గా స్క్రీన్‌పై కనిపిస్తున్నాడు అప్రమ్. తన కొడుకుని ఫస్ట్ టైమ్ ఇలా ఈ పాత్రలో స్క్రీన్‌పై చూసుకుని మంచు విష్ణు మురిసిపోతున్నాడు.
ఇక, ఈ సినిమా విషయానికి వస్తే, పలు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలవుతోంది. భారీ బడ్జెట్‌తో ఓన్ బ్యానర్లో రూపొందిస్తున్నారు మంచు ఫ్యామిలీ.
వివిధ భాషల నుంచి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అందులో ప్రబాస్ వంటి ప్యాన్ ఇండియా స్టార్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా వుండడం విశేషం.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..