కిడ్నీలో స్టోన్స్.! ఈ డైట్ ఫాలో చేస్తే, సర్జరీ అవసరం లేదా.?
- August 27, 2024
కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. మన శరీరంలోని వ్యర్ధాల్ని బయటికి పంపించి శరీరాన్ని ఆరోగ్యాన్ని వుంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయ్. మరి, మనం ఫాలో చేసే కొన్ని ఆహారపు అలవాట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతుంటాయ్.
కిడ్నీలో స్టోన్స్ చాలా చాలా బాధాకరమైన సమస్య. అలా కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఏం చేయాలి.? వైద్యుని సంప్రదించి సూచన మేరకు సర్జరీని ఆశ్రయించాలి. స్టోన్ సైజ్‌ని బట్టి, కొందరికి మందులు కూడా సూచిస్తుంటారు వైద్యులు.
ఆయా మందుల ద్వారా కిడ్నీలో రాళ్లు మెల్లగా కరిగిపోతాయ్. అయితే, వైద్య సూచనలతో పాటూ, కొన్ని రకాల ఆకుకూరలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొండపిండి ఆకు కిడ్నీలో రాళ్లను కరిగించడంలో కీలకంగా పని చేస్తుందని అంటారు. కిడ్నీలో స్టోన్స్ వున్న వాళ్లు కొండ పిండి ఆకు రసం తాగితే మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు.
అలాగే బచ్చలి ఆకు తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయ్. తెల్ల గోంగూర ఆకులు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్. చామ ఆకులు రెగ్యులర్‌గా తీసుకుంటే కిడ్నీలో స్టాన్స్ కరిగించుకోవచ్చు.
ఆకుకూరల్లో పొన్నగంటి కూరకు కిడ్నీలో స్టోన్స్ కరిగించే శక్తి ఎక్కువగా చెబుతారు. ఈ ఆకుకూర తీసుకునే అలవాటున్న వారిలో కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలు తక్కువంటున్నారు.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!