అంతర్జాతీయ యోగా వేడుకలకు ముస్తాబైన దుబాయ్
- June 18, 2016
ఇవాళ అనగా 18వ తారీకున దుబాయ్ ఇండియన్ కాన్సులేట్ జనరల్ వారి ఆధ్వర్యం లో దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధి గా బాబా రామ్ దేవ్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్న (17-06-2016) న వాలంటీర్ లను నియమించారు వారిని రెండు గ్రూప్ లు గా విభజించారు. వాలంటీర్ లకు ప్రత్యేకమైన టీ-షర్టులు ఇచ్చారు. ఈ కార్యక్రమం దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని 1 - 8 నెంబర్లు గల కన్వెన్షన్ హాల్స్ లో జరుగుచున్నది. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని విధములైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా భారతీయులే కాక ముస్లిం సోదరులుకూడా ముందుకు రావడం అందరిని ఉత్తేజ పరిచింది. ఈ కార్యక్రమానికి వాలంటీర్లుగా మన తెలుగు వారు అయిన జనగామ శ్రీనివాస్, ఆకుల పర్శరాములు, జనగామ బాలు, దొంతుల నరసయ్య, జనగామ బాలకిషన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీ గిరీష్ పంత్ (ప్రెసిడెంట్ దుబాయ్ చాప్టర్ - ఐపీఎఫ్ & సోషల్ వర్కర్) గారి పర్యవేక్షణలో జరుగనున్నది.



తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







