లైసెన్స్ లేని గ్యాస్ సిలిండర్ల విక్రయం.. 9 మంది అరెస్ట్.. 343 సిలిండర్లు స్వాధీనం
- August 31, 2024
దుబాయ్: ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించేలా లైసెన్స్ లేని గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న తొమ్మిది మందిని దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. 343 లైసెన్స్ లేని సిలిండర్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించే అక్రమ వీధి వ్యాపారులను అణిచివేసేందుకు దుబాయ్ పోలీసులు కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ అరెస్టులు జరుగుతున్నాయని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ బ్రిగ్ హరిబ్ అల్ షమ్సీ తెలిపారు. లైసెన్స్ లేని గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న నిందితులు వినియోగిస్తున్న రెండు వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సాధారణంగా సిలిండర్ల రవాణా, నిల్వ మరియు వినియోగానికి నిర్దిష్ట ప్రమాణాల ఉంటాయని అల్ షమ్సీ చెప్పారు. లైసెన్స్ పొందిన, ఆమోదించబడిన విక్రేతల నుండి మాత్రమే సిలిండర్లను కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!