బహ్రెయిన్ లో బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ వేడుకలు

- August 31, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ స్వర్ణోత్సవ వేడుకలు

మనామా: NBK Helping Hands వ్యవస్థాపక అధ్యక్షులు అనంతపురం జగన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా బహ్రెయిన్ లో ప్రవాస తెలుగు వారు కలిసి కేక్ కట్ చేసి బాలయ్యబాబు కి శుభాకాంక్షలు తెలియజేశారు.

NBK Helping Hands Bahrain కమిటీ వారు బాలయ్యబాబు 50 స్వర్ణోత్సవ వేడుకలను గల్ఫ్ వైడుగా 2024 సెప్టెంబర్ నెల 19వ తేదీన బాన్ సాంగ్ థాయ్ హలులో అతిరథ మహారథులతో ఘనంగా కార్యక్రమం చేయుటకు కమిటీ నిర్ణయించింది. 

ఈ వేడుకలకు గల్ఫ్ వైడ్గా ఉన్న ప్రముఖులను మరియు అభిమానులందరినీ భాగస్వాములు చేయాలని ఆహ్వాన కమిటీ నిర్ణయించింది.19 సెప్టెంబరు 2024 గురువారం జరిగే ఈ కార్యక్రమానికి తెలుగువారు అందరూ ఆహ్వానితులే అని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు వర్కింగ్ కమిటీ వడ్లమూడి రఘునాథ బాబు, తక్కెళ్లపాటి హరి బాబు గారు,కొత్తపల్లి రామ మోహన్ ,సతీష్, సుంకర శివ కోటేశ్వర రావు,ఆరే అనిల్,రాజేష్,గడిపూటి వెంకట్,చంద్ర బాబు,మీరా మహేష్ ,వాసుదేవరావు, మౌళి,వంశీ కృష్ణ మరియు సందీప్ తెలియజేశారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్ న్యూస్,TV5 న్యూస్ మీడియా పార్ట్నర్లుగా వ్యవహరిస్తున్నాయి.

వేదిక: బాన్ సంగ్ థాయ్ హాల్-బహ్రెయిన్ 
తేది: 19 సెప్టెంబరు 2024 (గురువారం)
సమయం : సాయంత్రం 6 గం॥ నుండి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com