నందమూరి వారసుడు ఎంట్రీ షురూ చేస్తున్నాడు.!
- September 03, 2024
నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. ఇదిగో అదిగో అంటున్నారు కానీ, ఇంతవరకూ మోక్షజ్ఞ తెరంగేట్రం జరగలేదు.
బాలయ్య 100వ చిత్రం నుంచీ ప్రచారం జరుగుతోంది కానీ, పని కావడం లేదు. కానీ, అందుకు టైమొచ్చినట్లే వుందిప్పుడు. ‘హనుమాన్’ సినిమాతో అందరి దృస్టీనీ విశేషంగా ఆకర్షించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ వుండబోతోందనీ ఇన్‌సైడ్ వర్గాల సమాచారం.
మైథాలజికల్ ఫాంటసీ కథాంశంతో ఈ ప్రాజెక్ట్ వుండబోతోందనీ, అలాగే సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈ సారి జరిగే ఈ ప్రచారం నిజం కానుందని అనుకోవచ్చేమో. ఇంతవరకూ జరిగిన ప్రచారం వేరు.. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం వేరు. ఎందుకంటే, ఈ దిశగా మోక్షజ్ఞ ప్రయత్నాలు మొదలెట్టినట్లే వుంది.
ఇటీవలే మోక్షజ్ఞ మేకోవర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో, త్వరలోనే నందమూరి అభిమానుల ఎదురు చూపులు ఫలించే అవకాశం లేకపోలేదు.
A new dawn is breaking at @ThePVCU!#SimbaisComing 🦁 pic.twitter.com/Kr91AkRil2
— Prasanth Varma (@PrasanthVarma) September 3, 2024
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!