శరీరంలో కొలెస్ట్రాల్ గురించి మీకీ విషయాలు తెలుసా.?

- September 03, 2024 , by Maagulf
శరీరంలో కొలెస్ట్రాల్ గురించి మీకీ విషయాలు తెలుసా.?

కొలెస్ట్రాల్ ఎక్కువయితే ఆరోగ్యానికి ప్రమాదం అన్న సంగతి తెలిసిందే. అయితే, శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ వుంటాయ్.

అందులో ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్, రెండోది గుడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ గుండెకు జరిగే రక్తప్రసరణను అడ్డుకుంటుంది.

గుండెకు రక్తాన్ని పంపు చేసే నాళాల్లో పేరుకుపోయి రక్త ప్రసరణను అడ్డుకోవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంది. కొన్ని సార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా తలెత్తే అవకాశాలున్నాయ్.

మరి, గుడ్ కొలెస్ట్రాల్ అనేది శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తినిస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలంటే ఏం చేయాలి.?

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండే ఫుడ్ తీసుకోవాలి. అంటే, బాదం, మొలకెత్తిన గింజలు, బీన్స్ వంటి వాటిలో ఎక్కువగా ఫైబర్ వుంటుంది. అలాగే యాపిల్, పీయర్స్ వంటి పండ్లలోనూ ఫైబర్ ఎక్కువగా వుంటుంది.

అవిసె గింజలు, గోధుమలు, బార్లీలోనూ ఫైబర్ ఎక్కువగా వుంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

అలాగే, హైట్‌కి మించిన వెయిట్ లేకుండా జాగ్రత్త పడాలి. ప్రతీరోజూ వాకింగ్ చేయాలి. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండాలి. వాల్ నట్స్ తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. వాల్ నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా వుంటాయ్.

అలాగే ధూమపానం అలవాటుంటే తగ్గించుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, వెన్నకి సంబంధించిన కుకీస్ వంటివి తక్కువగా తినాలి. సీజనల్‌గా వచ్చే మొక్కజొన్నలు మంచి కొవ్వులు పెరగడంలో తోడ్పడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com