సెప్టెంబర్ 15నుండి లేబర్ స్పోర్ట్స్ టోర్నమెంట్..!

- September 05, 2024 , by Maagulf
సెప్టెంబర్ 15నుండి లేబర్ స్పోర్ట్స్ టోర్నమెంట్..!

దుబాయ్: ఎమిరేట్ వ్యాప్తంగా ఆరవ దుబాయ్ లేబర్ స్పోర్ట్స్ టోర్నమెంట్ సెప్టెంబర్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈసారి క్రీడా విభాగాల సంఖ్యను 12కి పెంచినట్టు నిర్వాహకులు ప్రకటించారు.అలాగే టోర్నమెంట్‌లో శ్రామిక మహిళలకు బ్యాడ్మింటన్, యోగా, త్రాష్ బాల్ విభాగాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ప్రతి టోర్నమెంట్ విజేతలు తరువాత ఛాంపియన్స్ లీగ్‌లో పోటీపడతారన్నారు. 'మేకింగ్ దెమ్ హ్యాపీ ఈజ్ అవర్ గోల్ ' అనే థీమ్‌తో నిర్వహించే ఈ కార్యక్రమంలో 270 కంపెనీలకు చెందిన 46,000 మందికి కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.  దుబాయ్‌లోని పర్మనెంట్ కమిటీ ఆఫ్ లేబర్ అఫైర్స్, దుబాయ్ పోలీస్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజెన్‌షిప్‌తో పాటు కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ సహకారంతో దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సమన్వయంతో ఈ ఈవెంట్ ఫిబ్రవరి 23, 2025 వరకు జరుగుతుంది. ఫుట్‌బాల్, వాలీబాల్, క్రికెట్‌తో సహా క్రీడా ఈవెంట్‌లు దుబాయ్‌లోని వివిధ లేబర్ హౌసింగ్ సైట్‌లలో పది వేర్వేరు ప్రదేశాలలో జరుగుతాయని దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ సయీద్ హరేబ్ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com