రబీగ్ పోర్టులో భారీగా కొకైన్ సీజ్.. అధికారులు షాక్..!
- September 05, 2024
రాబిగ్: యాంటీ-నార్కోటిక్స్ ఆపరేషన్‌లో భారీడి కొకైన్ ను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC) స్వాధీనం చేసుకుంది. రాబిగ్ గవర్నరేట్‌లోని కింగ్ అబ్దుల్లా పోర్ట్ వద్ద 236 కిలోగ్రాముల కొకైన్‌తో కూడిన రవాణాను అడ్డుకుంది. జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ సహకారంతో ఈ డ్రగ్స్ దందా గుట్టును అధికారులు ఛేదించారు. అరటిపళ్ల రవాణాలో గుట్టుగా తరలిస్తున్న మత్తుపదార్థాలను గుర్తించి సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్‌లోని 911 నంబర్‌కు.. ఇతర సౌదీ ప్రాంతాలలో 999 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా ట్రాఫికింగ్‌కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని తెలియజేయాలని భద్రతా ఏజెన్సీలు ప్రజలను కోరాయి.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







