హ్యాపీ బర్త్ డే టు సౌత్ ఇండియా స్టైలిష్ విలన్ చరణ్ దీప్...
- June 19, 2016
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రామిసింగ్ విలన్ గా క్రేజ్ తెచ్చుకున్న చరణ్ దీప్ పుట్టిన రోజునేడు. ప్రభాస్ నటించిన 'డార్లింగ్' సినిమాలో ఓ చిన్న పాత్రతో వెండితెర ఆరంగేట్రం చేసిన ఈ కడప కుర్రాడు.. ఆ తర్వాత తమిళంలో ఘన విజయం సాధించిన 'జిల్లా' చిత్రంతో ప్రతినాయకుడిగా దమ్ము చూపాడు. గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన 'పటాస్'తో తనదైన విలనిజం పలికించి తెలుగు సినీజనాలను కూడా భయపెట్టాడు చరణ్. ఇక ఆల్ టైమ్ హిట్ 'బాహుబలి'లో కాలకేయ తమ్ముడి పాత్రలోనూ క్లైమాక్స్ ఫైట్ లో క్రూరత్వం చూపించాడు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్- వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన 'లోఫర్'లో ప్రతినాయకుడిగా చరణ్ దీప్ అదరహో అనిపించాడు. ఇక కన్నడనాట భారీ విజయం సాధించిన 'బాక్సర్'లో రేసర్ గా హీరోకు టప్ కాంపిటేషన్ ఇచ్చి కెరీర్ ను టాప్ గేర్ కు తీసుకెళ్లాడు ఈ కడప బాంబ్. ఆ ఊపులోనే ఇండియన్ ఫస్ట్ మోటోక్రాస్ మూవీ 'నాను మతు వరలక్ష్మి' మూవీలోనూ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. పాత్రలకు తగ్గట్లు రూపాన్ని మార్చుకుని విలన్ క్యారెక్టర్స్ కు ది బెస్ట్ ఛాయిస్ గా మారిన ఈ యంగ్ విలన్.. ప్రస్తుతం 'చుట్టాలబ్బాయి'లో ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తమిళ్ లో విశాల్ తో 'కత్తి సాండై'తో పాటు 'శరభ', 'వీర'లో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే లారెన్స్ సినిమా 'మొట్ట శివ కెట్ట శివ'లో ఈ స్టైలిష్ విలన్ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడు. అలాగే సునీల్- వీరు పోట్ల కాంబినేషన్ మూవీలోనూ ఈ చాకులాంటి కుర్రాడే విలన్. ఇక రిలీజ్ కు రెడీ అవుతున్న 'అంతం' మూవీలో హీరో తరహా క్యారెక్టర్ లో సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇవే కాకుండా 'బాహుబలి-2'లోనూ ఈ కుర్ర విలన్ మరోసారి థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న చరణ్ దీప్ కు.. ఈ ఏడాది మరింతగా కలసి రావాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్ డే టు సౌత్ ఇండియా స్టైలిష్ విలన్ చరణ్ దీప్.
తాజా వార్తలు
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్







