సౌదీలో సీజనల్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అలెర్ట్ జారీ..!
- September 13, 2024
రియాద్: సౌదీ పౌరులు, ప్రవాసులు సీజనల్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. సెహటీ అప్లికేషన్ 'సీజనల్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్' సేవ ద్వారా టీకా అపాయింట్‌మెంట్ కోసం బుక్ చేసుకోవచ్చు. అన్ని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుండి ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ సేవలను అందించడం ప్రారంభించినట్టు తెలిపింది. వృద్ధులు వ్యాధులు, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల సమస్యలకు వ్యతిరేకంగా వారి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కాలానుగుణ వ్యాక్సిన్‌లను తీసుకోవాలని సూచించింది. సీజనల్ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ సురక్షితమైనదని తెలిపింది. టీకా తీసుకోవడం, చేతులు కడుక్కోవడం, కళ్ళు నోటితో డైరెక్ట్ కాంటాక్ట్ నివారణ, తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు టిష్యూలను ఉపయోగించడం సహా పరిశుభ్రతను పాటించడం ద్వారా సీజనల్ ఇన్ఫ్లుఎంజాకు వ్యతిరేకంగా నివారణ చర్యలు తీసుకోవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







