ఆసియా మహిళ అక్రమ రవాణా..ఇద్దరు నిందితులపై విచారణ..!
- September 13, 2024
మనామా: మానవ అక్రమ రవాణా ఆరోపణలపై విచారణకు ఇద్దరు అనుమానితులను రిఫెరల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. అనుమానితులు ఒక ఆసియా మహిళను బందీగా ఉంచి, అనైతిక చర్యలకు ఉపయోగించుకున్నారని కేసులు నమోదు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 22 నమోదైనట్టు వెల్లడించింది. కేసుకు సంబంధించి పోలీసు నివేదికను స్వీకరించిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన దర్యాప్తును ప్రారంభించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది. అనుమానితులు ఒక క్రిమినల్ గ్రూపుగా ఏర్పడి ఉపాధి హామీతో బాధితురాలిని బహ్రెయిన్‌కు రప్పించారని తెలిపింది. బెదిరింపుల ద్వారా ఆమెను వ్యభిచారంలోకి నెట్టారని ఆరోపించారు. బాధితురాలు తన రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా వారు పోలీసులను అప్రమత్తం చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







