శంకర్ కాంబినేషన్ లో రజని,విక్రమ్ ల చిత్రం
- July 05, 2015
తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, విక్రమ్ కలిసి నటించనున్నారని తమిళ చిత్రసీమ సమాచారం. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్న 'రోబో 2' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. రజనీకాంత్ ఇప్పటికే ఈ సినిమాకు ఓకే చెప్పారని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో నటించేందుకు విక్రమ్ ఆసక్తి చూపించినప్పటికీ ఇంకా సంతకం చేయలేదని తెలిపాయి. 'రోబో 2'లో విక్రమ్ కు విలన్ పాత్ర ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నందున శంకర్ సినిమాకు ఎలా డేట్స్ ఎడ్జస్ట్ చేయాలా అని విక్రమ్ ఆచిస్తున్నారని సమాచారం. కాగా, రజనీకాంత్, వర్ధమాన దర్శకుడు రంజిత్ కాంబినేషన్ లో తెరెకెక్కనున్న సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సినిమా మధ్యలో్ షార్ట్ బ్రేక్ తీసుకుని 'రోబో 2' షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







