ఆధార్ కార్డ్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం..
- September 14, 2024
న్యూ ఢిల్లీ: ఆధార్ కార్డ్ హోల్డర్స్ కు భారత విశిష్ట గుర్తింపు ప్రాదికార సంస్థ (UIDAI) మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా.. ఉడాయ్ ఆ గడువును మరోసారి పెంచుతూ ప్రకటించింది. ఈ మేరకు ఉడాయ్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. 2024 డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు గడువును పెంచింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకునే వారు డిసెంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు.
ఉచిత సేవలు మై ఆధార్ (My Aadhaar) పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పెట్టిన తేదీ, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులు నమోదైనా, మార్పులు చేయాలన్నా ఉచితంగా చేసుకోవచ్చు. ఉచిత గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్ డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







