2023లో 853,000 మందికి పైగా ఒమానీలకు ఉద్యోగాలు.. ఫలితం ఇచ్చిన సంస్కరణలు..!!
- September 26, 2024
మస్కట్: విజన్ 2040 అమలు ప్రయత్నాలలో భాగంగా ఒమన్ లేబర్ మార్కెట్ పెరుగుదలను సాధిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్, ఫాలో-అప్ యూనిట్ వార్షిక నివేదిక ప్రకారం.. 2023లో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో 853,000 మందికి పైగా ఒమానీలు ఉపాధి పొందారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 6.4 శాతం అధికం. అలాగే ఉద్యోగాలు పొందిన ప్రవాసుల సంఖ్య కూడా 7% పెరుగుదలతో 1.8 మిలియన్లకు చేరుకుంది. కీలకమైన కార్మిక సంస్కరణలు దేశాన్ని నిరంతర విజయానికి నిలబెట్టాయని, కార్మిక మార్కెట్‌ను జాతీయ ప్రతిభకు మరింత ఆకర్షణీయంగా మార్చడం, ప్రైవేట్ రంగం యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలను పరిష్కరించడం ఈ విజయానికి కారణమని నివేదిక పేర్కొంది.
2023లో వ్యూహాత్మక ఉపాధి కార్యక్రమాలు:
ప్రైవేట్ రంగ సంస్థల్లో లేబర్ మార్కెట్ అవసరాల సర్వేను ప్రారంభించారు. రియల్ మార్కెట్ అవసరాలతో పాటు భవిష్యత్ ఉద్యోగ డిమాండ్లను తీర్చడానికి ఒమన్ శ్రామిక శక్తిని కలిగి ఉండేలా ప్రాజెక్టులను అమలు చేశారు. ఇంకా, 707,000 వర్క్ పర్మిట్ల జారీ చేయడంతోపాటు ఒమానీలు, ప్రవాసుల కోసం 634,000 వర్క్ కాంట్రాక్ట్‌లను రిలీజ్ చేశారు. ఫిషరీస్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం సెక్టోరల్ స్కిల్స్ యూనిట్లను ఏర్పాటు చేశారు. 2023లో ప్రారంభించబడిన నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ప్రాజెక్ట్, కార్మిక మార్కెట్ అవసరాలను గుర్తించడం, ఉపాధి డిమాండ్ల మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించారు. ఉపాధి అవకాశాలను పెంచడానికి రూపొందించబడిన నాలుగు ప్రధాన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లలో నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ ప్రాజెక్ట్ 55% పూర్తయింది. నేషనల్ స్ట్రాటజీ ఫర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ 49%, లేబర్ మార్కెట్ పాలసీస్ డెవలప్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ 65%, ట్రైనింగ్ ప్రాజెక్ట్‌తో పాటు రీప్లేస్మెంట్ కింద 11,000 కొత్త శిక్షణ అవకాశాలను కల్పించారు.దీంతో ప్రైవేట్ ప్రభుత్వ రంగాలలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంలో విజయ. సాధించారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..