షార్జా ప్రైవేట్ పాఠశాలల్లో ‘ప్రామాణిక’ పరీక్షలు అమలు..!!

- September 26, 2024 , by Maagulf
షార్జా ప్రైవేట్ పాఠశాలల్లో ‘ప్రామాణిక’ పరీక్షలు అమలు..!!

యూఏఈ: షార్జా తన ప్రైవేట్ పాఠశాలల కోసం ప్రామాణిక పరీక్షలను అభివృద్ధి, అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఎమిరేట్స్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ ఒక అసెస్‌మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌తో భాగస్వామ్యంపై సంతకం చేసింది. షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అథారిటీ (SPEA) ప్రాజెక్ట్‌లో భాగంగా నైపుణ్యం, సమాచారం మార్పిడి చేయడానికి డిగ్లోసియాతో కలిసి పని చేయనుంది. ఈ మేరకు రెండు సంస్థలు అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేశాయి. ఇది ఎమిరేట్ విద్యా లక్ష్యాలను సాధించే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను పేర్కొంది.  SPEA లైసెన్స్ పొందిన పాఠశాలలతో ప్రామాణిక పరీక్షల అమలును సులభతరం చేయడానికి అవసరమైన మొత్తం డేటా Diglossiaతో భాగస్వామ్యం చేయనుంది. ఈ పరీక్షలలో పాల్గొనాలని పాఠశాలలను ప్రోత్సహిస్తుందని, ఇది ఈ సంస్థలలో విద్య నాణ్యతను పెంచడానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు డిగ్లోసియా పరీక్షా ఫలితాలకు సంబంధించిన డేటా, సమాచారాన్ని అలాగే పాఠశాలలు నిర్వహించే ప్రామాణిక పరీక్షల విశ్లేషణను SPEAతో పంచుకుంటుందన్నారు. పరీక్షల ఫలితాల ఆధారంగా పాఠశాల పనితీరును మెరుగుపరచడానికి ప్రణాళికలను రూపొందించడంలో దోహదపడుతుందని తెలిపారు. ఎమిరేట్‌లో విద్య నాణ్యతను పెంపొందించడానికి, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్ కీలక దశగా పరిగణించబడుతుందని అథారిటీ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com