సౌదీ నుంచి ఇండియా చేరుకున్నారు నిర్మల్ వాసి

- October 01, 2024 , by Maagulf
సౌదీ నుంచి ఇండియా చేరుకున్నారు నిర్మల్ వాసి

హైదరాబాద్: సీఎం రేవంత్ చొరవతో సౌదీ నుంచి ఇండియా చేరుకున్నారు నిర్మల్ వాసి.  నిర్మల్ జిల్లా ముధోల్ మండలం రువ్వికి చెందిన రాథోడ్ నామదేవ్ అనే వ్యక్తి బతుకు తెరువు కోసం 5 నెలల క్రితం ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లాడు.  కువైట్ లో హౌస్ కీపింగ్ పని అని చెప్పి  నామదేవ్ ను   సౌదీలో ఒంటెల కాపరిగా ఏజెంట్...పెట్టారు.   అయితే ఏజెంట్ చిత్రహింసలు భరించలేక తనను ఎలాగైనా ఇండియా రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు రాథోడ్ నామదేవ్. 

ఇక సెల్ఫీ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... రాథోడ్ నామదేవ్ ను ఇండియా రప్పించే చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. సీఎంఓ అధికారులు...సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి రాథోడ్ నామదేవ్ ను ఇండియా రప్పించారు.  దీంతో తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి రాథోడ్ నామదేవ్ కుటుంభం ధన్యవాదాలు తెలిపారు.

--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com