‘దేవర’కి దసరా అయినా కలిసొస్తుందా.?
- October 01, 2024
భారీ అంచనాల నడుమ ‘దేవర’ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకి పాజిటివ్ టాక్ రాలేదు. కానీ, కష్టపడి సినిమాని ఆడిస్తున్నారు. అయితే, దసరా సెలవులు స్టార్ట్ అవుతున్నాయ్.
సెలవుల్లో ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్. అలా ‘దేవర’ సినిమాని చూడాలనుకుంటారేమో ఆడియన్స్. అలాగైనా కాస్త కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి మరి.
అయితే, ఈ దసరా సీజన్‌ని ‘దేవర’ కోసం యూజ్ చేసుకునేందుకు కొన్ని ట్రిక్స్ ఫాలో చేస్తున్నారట చిత్ర యూనిట్.
‘దావూది’ అనే పాటను ఇంతవరకూ సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ పాటను దసరా కానుకగా సినిమాలో యాడ్ చేస్తున్నారట. ఒకవేళ ఆల్రెడీ సినిమా చూసేసినవాళ్లయినా ఈ పాట కోసం మళ్లీ చూస్తారేమో అని.
ఈ పాటలో ఎన్టీయార్ స్టెప్పులు ఇరగదీసేశాడు. జాన్వీ కపూర్ బీభత్సమైన అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన సాంగ్ వీడియోతో ఆ విషయం తెలిసిందే.
అయితే, బిగ్ స్క్రీన్ ఎఫెక్ట్‌లో ఆ ఒక్క పాట కోసం ధియేటర్‌కి జనం వస్తారా.? అంతేకాదు, కొన్ని సీన్లు కూడా యాడ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిజమేనా.? తెలియాలంటే ‘దేవర’ చూడమని చెప్పాలి. నచ్చితే చూడొచ్చండోయ్.!
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







