మట్కా’.! రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మెగా ప్రిన్స్.!

- October 01, 2024 , by Maagulf
మట్కా’.! రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మెగా ప్రిన్స్.!

మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మట్కా’. ఈ సినిమాని పీరియాడికల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నారు.

కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కి జోడీగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు సెకండ్ లుక్ రిలీజ్ చేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ లుక్‌లోనూ వరుణ్ తేజ్ రెట్రో లుక్స్‌తో కిర్రాక్ పుట్టిస్తున్నాడు.

రెట్రో సూట్ ధరించి నోట్లో సిగరెట్‌తో కనిపిస్తున్న వరుణ్ తేజ్  ఈ స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా, నవంబర్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

వరుణ్ తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రమిది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారనీ తెలుస్తోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com