బిగ్ లొల్లి.! విష్ణు ప్రియ అందుకే టార్గెట్ అయిపోతోందా.?
- October 01, 2024
బిగ్ హౌస్ అంటేనే అనవసరమైన లొల్లికి కేరాఫ్ అడ్రస్. అదే జనానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోండి. అలా ఎవరైతే ఎంటర్‌టైన్ చేయగలరో ఏరి కోరి ఎంచుకుని వాళ్లనే కంటెస్టెంట్స్‌గా తీసుకొస్తుంటారు బిగ్‌బాస్ నిర్వహకులు.
ఈ సీజన్ బిగ్‌బాస్‌లోనూ అలాంటి కంటెస్టెంట్లకు ఏమాత్రం కొదవ లేకుండా చూసుకున్నారు. టీవీ యాంకర్‌గా తనదైన గొంతుతో పాపులర్ అయిన విష్ణు ప్రియను కూడా అందుకే తీసుకొచ్చారు.
ముందే చెప్పుకున్నాం కదా.. పాప ఎందుకంత పాపులర్ అంటే అందుకే అదేనండీ నోటి దురద (దూల). ఆ దురదతోనే హౌస్ మేట్స్‌ని నోటికొచ్చినట్లు ఆడేసుకుంటోందట.
నామినేషన్ల పర్వంలో భాగంగా అదే కారణంతో ఆమెని నామినేట్ చేశారు హౌస్‌లో తన తోటి కంటెస్టెంట్లు విష్ణు ప్రియని. అయితే, విష్ణు ప్రియ తనకు నోటి దూల వున్న మాట వాస్తవమే కానీ, విచక్షణ లేకుండా ఏది పడితే అది మాట్లాడను.. అని తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది.
తనకున్న నోటి దురదతోనే మొదటి రోజే నాగ మణికంఠని తేడాగాడు అనేసింది. అదే మనసులో పెట్టుకున్నాడు కాబోలు.. మణికంఠ నామినేషన్లలో ఎక్కడ ఛాన్స్ దొరికినా విష్ణు ప్రియని నామినేట్ చేయకుండా వదిలి పెట్టడం లేదు. ఈ వారం కూడా అదే రీజన్‌తో నామినేట్ చేసి పడేశాడు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







