రానా చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్.!

- October 03, 2024 , by Maagulf
రానా చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్.!

రీసెంట్‌గా రానా సమర్పణలో వచ్చిన ‘35 చిన్న కథ కాదు’ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్సాన్స్ అందుకుందో తెలిసిందే. ధియేటర్లలో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా వెరీ లేటెస్ట్‌గా ఓటీటీ ప్రేక్షకుల నుంచీ మంచి రివ్యూలు అందుకుంటోంది. నిర్మాతగా రానా మంచి సినిమాని టేకప్ చేశాడంటూ పొగడ్తలు వినిపించాయ్ ఈ సినిమా విషయంలో.

ఇప్పుడు అలాంటిదే మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు రానా. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘జిగ్రా’ సినిమాని తెలుగులో రానా రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా  తెలుగు వెర్షన్ ట్రైలర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రాణానికి ప్రాణంగా భావించే తమ్ముడు అనుకోకుండా డ్రగ్స్ కేసులో అరెస్టవుతాడు. తన తమ్ముడిని కాపాడుకోవడానికి అక్క చేసే పోరాటమే ఈ ‘జిగ్రా’. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కథ అన్ని వర్గాల ప్రేక్షకులకీ కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే.

అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాసన్ బాలా తెరకెక్కించిన ఈ సినిమాకి బాలీవుడ్ పాపులర్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు. కథ బాగుంటే, భాషతో సంబంధం లేకుండా సక్సెస్ అవుతున్న ఈ రోజుల్లో ‘జిగ్రా’ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com