యూఏఈలో టెలిమార్కెటర్ల మొబైల్ నంబర్‌ల నిలిపివేత..జరిమానాలు..!!
- October 03, 2024
యూఏఈ: టెలిమార్కెటర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. అనేక టెలిమార్కెటింగ్ నంబర్లను రద్దుచేశారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు అనేక మంది వ్యక్తులకు జరిమానా విధించారు. 2,000 కంటే ఎక్కువ ఉల్లంఘనలను గుర్తించి, జరిమానా విధించినట్టు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) తెలిపింది. చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి అతని/ఆమె పేరుతో లైసెన్స్ పొందిన ఫోన్ నంబర్ ద్వారా ఉత్పత్తులు, సేవల కోసం మార్కెటింగ్ ఫోన్ కాల్ చేస్తే, 5,000 దిర్హామ్ జరిమానా విధించబడుతుంది. వ్యక్తి రెండవసారి ఉల్లంఘిస్తే అతని/ఆమె పేరుతో ఉన్న అన్ని నంబర్లను 3 నెలల పాటు కట్ చేయడంతో పాటు Dh20,000 ఆర్థిక జరిమానా విధించబడుతుంది. 30 రోజులలోపు మూడవసారి అదే ఉల్లంఘనకు పాల్పడితే టెలికమ్యూనికేషన్ కంపెనీల నుండి ఎటువంటి సేవను పొందకుండా అతను/ఆమె 12 నెలల పాటు నిషేధం విధించడంతోపాటు పెనాల్టీ కింద Dh50,000 వరకు జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులు సహా ఒక టీచర్ మృతి
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!







