30లలో అడుగు పెట్టిన మహిళలూ ఇది గమనించారా.?

- October 03, 2024 , by Maagulf
30లలో అడుగు పెట్టిన మహిళలూ ఇది గమనించారా.?

మహిళల్లో 30 ఏళ్ల వరకూ మెటబాలిజం ఓ రకంగా వుంటుంది. ఆ తర్వాత మరోలా వుంటుంది. శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు కనిపిస్తుంటాయ్ 30 ఏళ్లు పైబడిన మహిళల్లో.

ఒకింత అలసట, నిస్సత్తువ ఆవహిస్తుంది. ముఖ్యంగా ఎముకలు బలహీనపడతాయ్. అందుకే 30 ఏళ్లు పైబడిన మహిళలు ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

అలాగే, మానసికంగా స్థిరంగా ఉత్సాహంగా వుండేందుకు కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఈ వయసులో తక్కువ కావడంతో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాల్షియం అంది ఎముకలు బలపడతాయ్.

‘డి’ విటమిన్ శరీరానికి బాగా అందేలా చూసుకోవాలి. పండ్లు, కొన్ని పచ్చి కూరగాయల్ని డైట్‌లో తప్పని సరిగా చేర్చుకోవాలి. ఓట్స్ తదితర ఆహారాన్ని తమ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కావల్సినంత ఫైబర్ శరీరానికి అందుతుంది.

బరువు పెరుగుతామేమో, లావయిపోతామేమో అనే భయంతో కొందరు మహిళలు ఈ వయసులో డైటింగ్ ఫాలో చేస్తుంటారు. కానీ, డైటింగ్ విషయంలో నిపుణుల సలహా పాటించడం మంచిదని సూచిస్తున్నారు.

పోషకాలున్న ఆహారాన్ని డైట్‌లో వుండేలా చూసుకుంటూనే డైటింగ్ ఫాలో చేయాలనీ, లేదంటే అనవసరమైన అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com