అరుదైన ఘనతను సొంతం చేసుకున్న జుకర్ బర్గ్
- October 04, 2024
న్యూయార్క్: మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. జెఫ్ బెజోస్‌ను దాటి తొలిసారిగా ఈ స్థానానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జుకర్‌బర్గ్ సంపద 206 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంపద 205 బిలియన్ డాలర్లు. ఇక ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 256 బిలియన్ డాలర్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. భారతీయ బిలియనీర్ ముకేశ్ అంబానీ 107 బిలియన్ డాలర్ల సంపదతో 14వ స్థానంలో ఉండగా.. 100 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారు.
ఇటీవల మెటా షేర్లు అంచనాలకు మించి రాణించాయి. రెండో త్రైమాసికంలో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదవ్వడంతోపాటు ఏఐ చాట్బాట్లను మరింత శక్తివంతంగా మార్చేందుకు లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను పెంచడంతో మెటా షేర్లు 23శాతం పెరిగాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్ సెషన్లో సంస్థ షేరు విలువ ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకి 582.77 డాలర్ల వద్ద ముగిసింది. ఏఐ రేసులో ముందంజలో నిలిచేందుకు డేటా సెంటర్లు, కంప్యూటింగ్ పవర్‌పై మెటా పెద్ద ఎత్తున డబ్బుల్ని వెచ్చిస్తోంది. తాజాగా ఓరియన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్‌ను కూడా పరిచయం చేసింది.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







