గోవా రైల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చ జెండా
- October 06, 2024
సికింద్రాబాద్: సికింద్రాబాద్–గోవా వెళ్లే రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని భోయి గూడా వైపు గల పదో నెంబర్ ప్లాట్ ఫారం పై నుండి గోవా రైలు సర్వీస్ ను ప్రారంభించారు..
తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కో-డ-గామాతో మెరుగైన అనుసంధానం చేశారు. ఈ రైలు వారానికి రెండు రోజులు ఇరు మార్గాలలో నడపబడుతోంది. ప్రస్తుతం కర్నాటక మరియు గోవా ప్రాంతాలకు వెళ్లేందుకు తెలుగు వారికి ప్రయాణ సౌలభ్యాలు తక్కువగా ఉన్నాయి.
గోవా చేరుకోవడానికి గుంతకల్లు వద్ద ఉన్న ఇతర రైళ్లకు అనుసంధానించవలసిన లింక్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ రైలు అనుకూలమైన సమయాలతో సికింద్రాబాద్ నుండి ప్రత్యేకమైన రైలు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది..
ఈ కొత్త రైలు దాదాపు 854 కి.మీల దూరాన్ని దాదాపు 20 గంటలపాటు ఎగువ దిశలో మరియు 21 గంటల పాటు దిగువ దిశలో ప్రయాణం పూర్తిచేస్తుంది.. ఈ రైలు మార్గంలో ప్రత్యేకమైన చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఇతర ముఖ్యమైన నగరాలను కలుపుతూ, నూతన ప్రాంతాలనుంచి పెరిగిన ప్రయాణికులతో నిర్దిష్ట బంధాన్ని ఏర్పరుచు కోవడానికి అవకాశం కల్పిస్తుంది.. ఈ రైలు అత్యాధునిక ఎల్.ఎచ్.బి. కోచ్లతో ప్రవేశపెట్టబడి ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని మరియు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







