టీచర్లకు గోల్డెన్ వీసా..అక్టోబర్ 15 నుండి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..!!
- October 06, 2024
దుబాయ్: ఎమిరేట్ ప్రైవేట్ విద్యా రంగానికి విశేష కృషి చేసిన అసాధారణ ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు మంజూరు చేయనున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దుబాయ్ యొక్క నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) గోల్డెన్ వీసా కోసం దరఖాస్తులను అక్టోబర్ 15న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే..
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉన్నత విద్యా సంస్థల అకడమిక్ హెడ్స్, ఉపాధ్యాయులు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ నాయకులు, ECC మేనేజర్‌లు, ప్రిన్సిపాల్‌లు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ
పాఠశాలలు, ECCలు, HEIలు పైన పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా అర్హత కలిగిన సిబ్బందిని నామినేట్ చేయవచ్చు.
అవసరమైన పత్రాలు
KHDA పాఠశాల రేటింగ్ నివేదికలు (ప్రిన్సిపాల్స్ కోసం)
అవార్డు సర్టిఫికేట్లు
విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి సర్వే ఫలితాలు, టెస్టిమోనియల్‌లు
స్టాఫ్ టెస్టిమోనియల్‌లు (ప్రిన్సిపాల్స్, ECC మేనేజర్‌లు, అకడమిక్ హెడ్‌ల కోసం)
మెరుగైన విద్యార్థి ఫలితాలను చూపే డాక్యుమెంటేషన్
బోర్డు ఆఫ్ గవర్నర్ల నుండి సిఫార్సు, నామినేషన్ లెటర్స్
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







