'అమరన్' మెలోడియస్ ఫస్ట్ సింగిల్ 'హే రంగులే' సాంగ్
- October 07, 2024హీరో నితిన్ లాంచ్ చేసిన శివకార్తికేయన్, సాయి పల్లవి, రాజ్‌కుమార్ పెరియసామి, ఆర్‌కెఎఫ్‌ఐ & సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ 'అమరన్' మెలోడియస్ ఫస్ట్ సింగిల్ 'హే రంగులే' సాంగ్
ప్రిన్స్ శివకార్తికేయన్ మల్టీలింగ్వల్ బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'హే రంగులే' సాంగ్ ని హీరో నితిన్ లాంచ్ చేశారు. సెన్సేషనల్ కంపోజర్ జి వి ప్రకాష్ ఈ సాంగ్ ని లవ్లీ మెలోడియస్ సాంగ్ గా కంపోజర్ చేశారు.
సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా తమ లైవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు. ఈ సాంగ్ లో శివకార్తికేయన్, సాయి పల్లవి క్యారెక్టర్స్ లైఫ్ జర్నీ బ్యూటీఫుల్ గా వుంది. 'హే రంగులే' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లు గా వున్నారు.
ఈ మూవీ శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా రూపొందించారు.
అమరన్ ఈ దీపావళికి అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







