యష్మిదీ సోనియా పరిస్థితేనా బిగ్‌బాస్.!

- October 10, 2024 , by Maagulf
యష్మిదీ సోనియా పరిస్థితేనా బిగ్‌బాస్.!

సోనియాని బిగ్ హౌస్‌లో విలన్‌గా ఓ బూచిలా చూపించి బయటికి పంపించేశారు. నిజంగానే సోనియాది అదే వ్యక్తిత్వమా.? అంటే కానే కాదు.. అదంతా బిగ్‌బాస్ సృష్టించిన క్యారెక్టర్ వ్యక్తిత్వం.
ఆమె క్యారెక్టర్‌ని అలాగే డిజైన్ చేశాడు బిగ్‌బాస్. కానీ, అది బయటికి ప్రొజెక్ట్ అయిన విధానంతో ఆమె రియల్ క్యారెక్టర్‌నే అపార్ధం చేసుకున్నారు ఆడియన్స్.
హౌస్ నుంచి బయటికొచ్చిన సోనియా అదే విషయాన్ని తన ఇంటర్వ్యూల్లో పదే పదే చెబుతూ తన క్యారెక్టర్ర‌కి రిపేర్లు చేసుకునే ప్రయత్నం చేసింది.
తన వ్యక్తిత్వం అలాంటిది కాదనీ, బిగ్‌బాస్ హౌస్‌లో జరిగింది వేరు, వాళ్లు టెలికాస్ట్ చేసింది వేరు.. తనను కావాలనే బద్నాం చేశారు.. అంటూ సోనియా గగ్గోలు పెట్టింది.
హోస్ట్ నాగార్జున పైనా సోనియా గుస్సా అయ్యింది. సోనియా పరిస్థితి అలా వుంటే, ఇప్పుడు అదే పరిస్థితి హౌస్‌లో యష్మికి వచ్చినట్లు అర్ధమవుతోంది.
సడెన్‌గా యష్మి గ్రాఫ్ పడిపోయింది. కంప్లీట్ నెగిటివిటీ ప్రొజెక్ట్ అవుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లో ప్రవేశించిన కంటెస్టెంట్స్ అంతా యునానిమస్‌గా యష్మికి ‘సుత్తి’ అనే బిరుదిచ్చేశారు.
అంతేకాదు, లోపలికెళ్లాక, నామినేషన్లలోనూ యష్మిని టార్గెట్ చేసేశారు. చూస్తుంటే ఈ వారం యష్మి హౌస్‌లోంచి బయటికి వెళ్లక తప్పదేమో అనిపిస్తోంది. ఈ లోపే ఇంకే స్థాయలో ఆమె తన క్యారెక్టర్‌ని లాస్ అవుతుందో ఏమో.! చూడాలిక.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com