దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
- October 10, 2024
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) (Ratan Tata) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంత కాలంగా ఆయన వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు.
రతన్ టాటా చనిపోయారంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 'గడియారం టిక్ చేయడం ఆగిపోయింది. టైటాన్ చనిపోయింది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారు, ఆయన వ్యాపార, వెలుపలి ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు.ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ ఎదుగుతాడు. ఆర్.ఐ.పి' అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







