‘జనక అయితే గనక’.! సుహాస్ లిస్టులో మరో హిట్టు చేరిపోతుందా.?

- October 10, 2024 , by Maagulf
‘జనక అయితే గనక’.! సుహాస్ లిస్టులో మరో హిట్టు చేరిపోతుందా.?

సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రావల్సిన సినిమా ‘జనక అయితే గనక’. కానీ, ఆ టైమ్‌లో భారీ వర్షాలూ, వరదల కారణంగా సినిమా వాయిదా వేశారు.
ఇప్పుడు ఈ వారం అంటే అక్టోబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుహాస్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ఇది. దిల్ రాజు బ్యానర్ నుంచి ప్రతిష్టాత్మకంగా వస్తున్న సినిమా ఇది.
సహజంగానే దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలంటే ఓ అంచనా వుంటుంది. ట్రైలర్ చూస్తే ‘జనక అయితే గనక’ సినిమాపైనా అంచనాలు నెలకొన్నాయ్.
ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటూ మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారట ఈ సినిమాలో. వాషింగ్ మెషీన్ సేల్స్ బాయ్‌గా పని చేసే వ్యక్తి పెళ్లి తర్వాత బడ్జెట్ లెక్కల్లో భాగంగా పిల్లలను కనడానికి టైమ్ తీసుకోవాలనుకుంటాడు.
అందుకోసం సేప్టీ (కండోమ్) వాడతాడు. అయినా కానీ, భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆ కండోమ్ కంపెనీపైనే కేసు పెడతాడు. ఇదీ ఈ స్టోరీ కథ. మరి, ఆ వ్యక్తికి ఎలా న్యాయం జరిగింది.? చివరికి ఈ సినిమా కథ ద్వారా ఇచ్చిన మెసేజ్ ఏంటీ.? అనేది తెలియాలంటే ‘జనక అయితే గనక’ చూడాల్సిందే.
కండోమ్స్‌పై కొన్ని సినిమాలు ఇప్పటికే చూశాం. కానీ, ఈ తరహా కాన్సెప్ట్‌లో కథని చూడలేదు, వినలేదు. అలాంటి విభిన్న కథాంశంతో వస్తున్న ‘జనక అయితే గనక’ ఆసక్తికరంగానే అనిపిస్తోంది. ఆ ఆసక్తిని సినిమా అందుకుందో లేదో తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com