వావ్.! ఏమి కాన్ఫిడెన్స్ సుధీర్ బాబూ.!
- October 10, 2024
సుధీర్ బాబు ఏం చేసినా అలాగే వుంటుంది మరి. కమర్షియల్ హంగులకు దూరంగా కంటెంట్ రిచ్ సినిమాలకు పెద్ద పీట వేసే హీరోల్లో సుధీర్ బాబు ముందు వరసలో వుంటాడు.
ఇటీవలే ‘హరోం హర’ అనే ఓ డిఫరెంట్ యాక్షన్ సినిమాతో వచ్చాడు. అలాగే ‘జటాధర’ అనే మరో యాక్షన్ పిలింలోనూ సుధీర్ బాబు నటిస్తున్నాడు.
ఈ శుక్రవారం తాజా తాజాగా ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేస్తున్నాడు సుధీర్ బాబు.
షియాజీ షిండే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కోసం ఓ కొడుకు ఏం చేయడానికైనా సిద్ధమే. ఆఖరికి కొడుకు క్యాన్సర్ పేషెంట్ అని అబద్ధం చెప్పి అప్పులు చేసే తండ్రిని సమర్ధించడానికి నిజంగా తనకి క్యాన్సరే అని ఒప్పుకునే గొప్ప కొడుకు ఈ సినిమాలోని సుధీర్ బాబు పోషించే పాత్ర.
ట్రైలర్ చూస్తుంటే, కన్న తండ్రి ఒకరు, పెంచిన తండ్రి ఒకరు. పెంచిన తండ్రికే ఎక్కువగా సుధీర్ బాబు ప్రయారిటీ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ ఇద్దరు తండ్రుల ముద్దుల కొడుకు కథేంటో తెలియాలంటే ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా చూడాల్సిందే.
అయితే, రెండు రోజుల ముందే ఈ సినిమా ప్రీమియర్స్ వేస్తుండడంతో సినిమా కంటెంట్‌పై చిత్ర యూనిట్ ఎంత నమ్మకంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. రెండు రోజులు ముందే.. అంటే టాక్ ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతి. కానీ, కంటెంట్‌పై ఎంత నమ్మకముంటే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంటుంది.!
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







