యాక్షన్ గాళ్‌గా మారిపోయిన మాళవిక మోహనన్.!
- October 10, 2024
మలయాల బ్యూటీ మాళవిక మోహనన్ యాక్షన్ మొదలెట్టేసింది. ఇటీవల ‘తంగలాన్’ కోసం ఓ డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించిన మాళవిక మోహనన్ ఇప్పుడు యాక్షన్ షురూ చేసింది.
కార్తీ హీరోగా ‘సర్ధార్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాళవిక హీరోయిన్గా నటిస్తోంది. మాళవికపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట ఈ సినిమాలో.
వాటి కోసం కాస్త ఎక్కువగానే కష్టపడుతోంది మాళవిక. ఆ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలియజేసింది మాళవిక మోహనన్.
ఒంటి నిండా రోప్స్‌తో కట్టివేయబడిన కాస్ట్యూమ్‌తో వున్న ఫోటోస్‌ని షేర్ చేసి తన యాక్షన్ గురించి తెలుపుకొచ్చింది మాళవిక. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
తెరపై ఎంతో అందంగా అద్భుతంగా కనిపించే ఈ సన్నివేశాల వెనక ఆర్టిస్టుల కష్టం ఏ రేంజ్లో వుంటుందో మాళవిక ధరించిన దుస్తులు చూస్తేనే అర్ధమవుతుంది. ప్రస్తుతం మాళవిక మోహనన్ ఒకవైపు తమిళంలో ‘సర్దార్ 2’లో నటిస్తూనే మరోవైపు తెలుగులో ప్రబాస్ సరసన ‘రాజాసాబ్’ సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురు చిన్నారులు సహా ఒక టీచర్ మృతి
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!







