రామ్ పోతినేని, మహేష్ బాబు పచ్చిగొల్ల, #RAPO22 అనౌన్స్‌మెంట్
- October 13, 2024
ఉస్తాద్ రామ్ పోతినేని తన 22వ మూవీని దసరా పండగ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో అలరించిన మహేష్ బాబు పచ్చిగొల్ల ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
#RAPO22 రామ్ కెరీర్‌కు సిగ్నిఫికెంట్ ఎడిషన్ కానుంది. ఇటీవల యాక్షన్-ఓరియెంటెడ్ పాత్రలతో అలరించిన రామ్ ఈ మూవీలో ఓ యూనిక్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. రామ్ స్టైలిష్ మేకోవర్‌లో కనిపించనున్నారని అనౌన్స్‌మెంట్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం ఇంపాక్ట్ ఎమోషన్స్ ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది. రామ్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది.
దర్శకుడు మహేష్ బాబు తన మునుపటి చిత్రాలలో హ్యుమర్, ఎమోషన్స్ బ్లెండ్ చేసి అలరించారు , అప్ కమింగ్ మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మూవీ లైట్ హార్టెడ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనుంది.
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు, ఇందులో ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నీషియన్లు పని చేయనున్నారు.
త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.
తారాగణం: రామ్ పోతినేని
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: మహేష్ బాబు పచ్చిగొల్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







