టాప్ డెస్టినేషన్ల కోసం ఫుల్ డిమాండ్.. పెరుగుతున్న టిక్కెట్ ధరలు..!!

- October 14, 2024 , by Maagulf
టాప్ డెస్టినేషన్ల కోసం ఫుల్ డిమాండ్.. పెరుగుతున్న టిక్కెట్ ధరలు..!!

యూఏఈ: నూతన సంవత్సర  వేడుకలకు యూఏఈ వాసులు సిద్ధమవుతున్నారు. GCCలోని నివాసితులు, ప్రవాసులు సెలవులు లేదా ఇంటికి తిరిగి వెళ్లేందుకు ప్రణాళికలను ఇప్పటినుంచే వేసుకుంటున్నారు. అత్యంత ప్రసిద్ధి చెందిన కొన్ని గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టిక్కెట్ ధరలు సగటున 10.81 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, కువైట్కి వెళ్లే విమాన టిక్కెట్ ధరలు గత శీతాకాలం కంటే 7.33 శాతం తక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వెగో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మమూన్ హ్మెడాన్ తెలిపారు. "ప్రయాణ డిమాండ్, పెరుగుతున్న ఇంధన ఖర్చులతో సహా అనేక కారణాల వల్ల ధరలలో ఈ పెరుగుదల ఉంది. పెరుగుతున్న ఖర్చులతో పెరిగిన డిమాండ్ను బ్యాలెన్స్ చేసేందుకు విమానయాన సంస్థలు ధరలను సర్దుబాటు చేస్తున్నాయి."అని తెలిపారు.  అధిక ఛార్జీలు ఉన్నప్పటికీ GCC నుండి ప్రయాణికులు లండన్, పారిస్, దుబాయ్ వంటి ప్రసిద్ధ గమ్యస్థానాలను సందర్శించడానికి ఆసక్తిగా ఉన్నారని డేటా వెల్లడిస్తుందని మామూన్ వివరించారు.  
వీగో, ట్రావెల్ యాప్, ఆన్లైన్ మార్కెట్ప్లేస్ ప్రకారం.. కైరో GCC ప్రయాణికులకు అత్యంత ప్రజాదరణ పొందిన నగరంగా ఉంది. ఇప్పటివరకు వీగో సెర్చ్ డేటా ప్రకారం.. జెడ్డా, ఇస్తాంబుల్, కొచ్చిన్, బ్యాంకాక్, లాహోర్, లండన్, దుబాయ్,  కువైట్ అత్యధికంగా సెర్చ్ చేసిన మొదటి పది నగరాలుగా ఉన్నాయి. ఈ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు ధరలు మరింత పెరగకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  మరోవైపు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల ప్రయాణాలకు సిద్ధమవుతున్న యూఏఈ నివాసితులు.. ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని సిద్ధం కావాలని సూచిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com