వాట్సాప్ లో లో_లైట్ వీడియో కాలింగ్ మోడ్ ఫీచర్
- October 14, 2024
వాట్సాప్ లో వీడియో కాలింగ్ అనేది వినియోగదారులకు అత్యంత ఉపయోగకరమైన ఫీచర్. ఇది మనకు ప్రియమైన వారితో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇస్తుంది. ముఖ్యంగా, ఇది కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరియు సహచరులతో సులభంగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. వీడియో కాలింగ్ ద్వారా మనం ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా, ఎలాంటి అవరోధాలు లేకుండా మాట్లాడవచ్చు. అయితే ఈ వీడియో కాల్ వెలుతురు సరిగ్గా లేని సమయంలో అవతలి వారితో మాట్లాడటం కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. వెలుతురు సరిగ్గా లేకపోతే అవతల వారి ఫేస్ ని సరిగ్గా గుర్తించలేము. ఈ సమస్యకు వాట్సప్ పరిష్కారం కనుగొని సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టింది అదేంటో తెలుసుకుందాం.
వాట్సాప్ లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆ ఫీచరే లో లైట్ వీడియో కాలింగ్ మోడ్. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులకు తక్కువ కాంతిలోనూ మెరుగైన వీడియో కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. చీకటిగా ఉన్న గదుల్లోనూ వీడియో కాల్స్ స్పష్టంగా, నాణ్యంగా ఉంటాయి. ఈ ఫీచర్ యాక్టివేట్ చేయడం కూడా చాలా సులభం.
ముందుగా, మీ వాట్సాప్ ఓపెన్ చేసి వీడియో కాల్ ప్రారంభించండి. తర్వాత, మీ వీడియోను ఫుల్ స్క్రీన్ చేయండి. ఫుల్ స్క్రీన్ లో, కుడి పక్కన ఉన్న ‘టార్చ్’ గుర్తును ప్రెస్ చేయండి. దీని ద్వారా లో లైట్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. ఇపుడు ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తక్కువ కాంతిలోనూ వీడియో కాల్స్ స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. మీ ముఖానికి ఎక్కువ వెలుతురు వచ్చేలా లైట్‌ను అడ్జస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ iOS మరియు Android వెర్షన్లలో అందుబాటులో ఉంది.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







