TANA ఆధ్వర్యంలో అమెరికాలో రహదారుల దత్తత
- October 16, 2024
అమెరికా: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హ్యారిస్ బర్గ్ నగరంలో మిడ్ అట్లాంటిక్ తానా విభాగం వారు సామాజిక భాద్యత పై అవగాహన కల్పిస్తూ "అడాప్ట్ ఏ హైవే" కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా, అత్యంత రద్దీ గల రహదారిని తానా ఆధ్వర్యంలో దత్తత తీసుకోవటం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా మిడ్-అట్లాంటిక్ తానా బృందం రహదారి పరిసరాలు పరిశుభ్రం చేయడమే కాకుండా పచ్చదనాన్ని పరిరక్షించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. హ్యారిస్ బర్గ్ తానా టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దలు, పలువురు విద్యార్థులు చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మిడ్ అట్లాంటిక్ తానా రీజినల్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు మాట్లాడుతూ అమెరికా సమాజంతో మమేకమై సమాజ సేవ చేయాలనే సంకల్పం కలిగించడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ కార్యక్రమం చేపట్టింది అని తెలియ జేశారు. ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన హ్యారిస్ బర్గ్ తానా బృందానికి తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ధన్యవాదాలు తెలిపారు.
ఈ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు సమాజానికి ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమం ప్రకృతి పట్ల చక్కటి అవగాహన కలిగించి, ప్రకృతిని, పచ్చదనాన్ని ఎలా సంరక్షించుకోవాలో నేర్చుకున్నామని తెలిపారు. తానా ఆధ్వర్యంలో విద్యార్థులలో సేవా భావం పెంపొందించేలా సమాజానికి మేలు చేసే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ఆకాంక్షించారు.


తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







