నవంబర్‌లోనే ‘మెకానిక్ రాఖీ’ ఆగమనం.!
- October 16, 2024
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో లవర్ బోయ్ విశ్వక్ సేన్‌లో మాస్ యాంగిల్ బయటికొచ్చింది. గోదావరి యాసలో విశ్వక్ సేన్ పలికిన డైలాగులు.. మాస్ లుక్స్ ఒకింత ఆయన ఫ్యాన్స్‌కి మజా ఇచ్చాయనుకోండి.
కానీ, సినిమా ఆశించిన మేర విజయం అందుకోలేకపోయింది. ధియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ ఈ సినిమా రీచ్ అందుకోలేదు. అయితే, ఇప్పుడు మరో మాస్ మూవీతో విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌కి మంచి ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు.
అదే ‘మెకానిక్ రాఖీ’. టైటిల్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ రిలీజ్ అయిన ప్రోమోస్ ఓ మోస్తరు పాజిటివ్ టాక్‌నే తెచ్చుకున్నాయ్.
‘గులామైతలే..’ సాంగ్‌కి మంచి వ్యూస్ వచ్చాయ్. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాధ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నవంబర్ 22న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్లు ప్రకటించారు.
‘గ్యాంగ్స్ ఆప్ గోదావరి’ సినిమాతో డిజప్పాయింట్ చేసిన విశ్వక్ సేన్, ‘మెకానిక్ రాఖీ’గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







