చికెన్ లివర్‌ తినడం ఆరోగ్యానికి మంచిదా.? కాదా.?

- October 16, 2024 , by Maagulf
చికెన్ లివర్‌ తినడం ఆరోగ్యానికి మంచిదా.? కాదా.?

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్ దమ్ బిర్యానీకి బోలెడంత మంది ఫ్యాన్స్ వున్నారు. అయితే, హెల్త్ పరంగా చికెన్ కన్నా, మటన్ మంచిదని చెబుతుంటారు. కానీ, చికెన్‌ తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. . ముఖ్యంగా చికెన్ లివర్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.

చికెన్‌లో లివర్‌లో సెలోనియం అధికంగా వుంటుంది. ఇది గుండె జబ్బులు దరి చేరనియకుండా చేస్తుంది.

ఒకవేళ గుండె జబ్బుతో బాధపడేవారు సైతం చికెన్ లివర్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం నుంచి కొంతైనా బయటపడొచ్చని తాజాగా ఓ సర్వేలో తేలింది.

అంతేకాదు, బీపీ, షుగర్ వున్నవారికి చికెన్ లివర్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

చిన్న పిల్లలకు, వయసు మళ్లిన వృద్ధులకు చికెన్ లివర్ ఎంతో ఆరోగ్యకరమైనది. తినడానికి ఈజీగా వుంటుంది. అలాగే ఆరోగ్యం కూడా.

తాజాగా కొన్ని సర్వేల్లో తేలిన అంశమేంటంటే, చికెన్ లివర్ తినడం వల్ల క్యాన్సర్ ముప్పు తక్కువగా వుంటుందట.

చికెన్ లివర్‌లో వుండే ఫోలేట్ లైంగిక సామర్ధ్యాన్ని బలపరుస్తుంది. చికెన్ లివర్‌లో పోషకాలు అధికంగా వుండడంతో పాటూ, ఎ విటమిన్ కూడా పుష్కలంగా వుంటుంది.

కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ కండరాల్ని ధృడం చేయడంలోనూ చికెన్ లివర్ తోడ్పడుతుంది. ఎలా చూసినా లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com