రాధికా ఆప్టే ఎన్నాళ్లకెన్నాళ్లకు.!
- October 17, 2024
రాధికా ఆప్టే.. ఆ పేరు వినగానే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గుర్తుకొస్తుంది. తెరపై బోల్డ్ క్యారెక్టర్లు చేయడమే కాదు. వున్నది వున్నట్లుగా కుండ బద్దలుకొట్టేయడంలోనూ రాధికా ఆప్టే ఆమెకు ఆమే సాటి.
తెలుగులో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసింది. వాటిపై అనేక రకాల విమర్శలు కూడా చేసింది. తెలుగు దర్శక, నిర్మాతలు, హీరోలపై పలు బోల్డ్ కామెంట్స్ చేసింది.
ఎక్కడున్నా రాధికా ఆప్టే కాంట్రవర్సీలో ముందుంటుంది. అలాగని విషయం లేని నటి కాదు. మంచి విషయం వున్న నటి. ఎలాంటి క్యారెక్టర్‌లో అయినా ఇట్టే ఇమిడిపోగల టాలెంట్ వున్న ముద్దుగుమ్మ.
అయితే, ఈ మధ్య రాధికా ఆప్టే పేరు పెద్దగా వినిపించడం లేదు మీడియాలో. అలాంటిది తాజాగా ఓ ఈవెంట్‌లో దర్శనమిచ్చిన రాధికా ఆప్టే మీడియా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యి, మాంచి స్టఫ్ ఇచ్చింది.
అంతలా ఆమె ఏం చేసిందంటారా.? అదేం లేదండీ.. బేబీ బంప్‌తో కనిపించింది. దాంతో, ఒక్కసారిగా షాక్ అయిన మీడియా కెమెరాలు ఆమెను చుట్టుముట్టాయ్.
అలా రాధికా ఆప్టే మళ్లీ న్యూస్‌లో కనిపించింది. అయితే, రాధికా ఆప్టేకి ఎప్పుడో పెళ్లయిపోయింది. ఆమె పర్సనల్ విషయాలు ఎప్పుడూ మీడియాలో చర్చకు రాలేదు. కానీ, తాజాగా బేబీ బంప్ ముచ్చటతో ఆమె గురించి మళ్లీ చర్చలు మొదలయ్యాయంతే.!
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







