అనన్య నాగళ్లకు ఈ సారి కలిసొచ్చేలానే వుంది.!
- October 17, 2024
అందాల భామ, పదహారణాల తెలుగమ్మాయ్ అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పొట్టేల్’. గత కొంత కాలంగా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు.
నిసా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో యువ చంద్ర హీరోగా నటిస్తున్నాడు. ఎపిక్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రోమోలు చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నాయ్.
సాహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాకి ప్రతిష్టాత్మకమైన మైత్రీ మూవీస్ సపోర్ట్ కూడా వుండడంతో అంచనాలు భారీగా వున్నాయ్.
కాగా, అనన్యా నాగళ్ల ఇటీవల వరదల నేపథ్యంలో తనవంతుగా కొంత అమౌంట్ డొనేట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది. చిన్న సినిమాల నటి అయినా పెద్ద మనసు చాటుకోవడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఎక్కువగా హారర్, థ్రిల్లర్ మూవీస్‌లో మాత్రమే అవకాశాలు దక్కించుకుంటున్న అనన్య నాగళ్లకు ‘పొట్టేల్’ నిర్మాణం పరంగా ఓ పెద్ద అవకాశమే అని చెప్పొచ్చు. అన్నీ కలిసొచ్చి కంటెంట్ నచ్చిందంటే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఖాయం చూడాలిక.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







