నిధి అగర్వాల్: దశ తిరగడం అంటే ఇదే మరి.!
- October 17, 2024
ఎప్పుడో స్టార్ హీరోయిన్ అవ్వదగ్గ అన్ని అర్హతలున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. కానీ, కాలం కలిసి రావడం అనేదొకటి వుంటుంది కదా.
అదే కలిసి రాలేదు నిధి అగర్వాల్‌కి. దాంతో ఎక్కడికో వెళ్లిపోవాల్సిన ఈ ముద్దుగుమ్మ అక్కడే ఆగిపోయింది. అక్కినేని హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.
ఆ తర్వాత తమిళ నాట కూడా అదృష్టం పరీక్షించుకుంది. కానీ, అక్కడ కూడా అంతంత మాత్రమే. కానీ, ప్రస్తుతం ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయ్.
ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం. ఇంకోటి ప్రబాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’చిత్రం.
ఈ రెండూ భారీ చిత్రాలే. క్రేజీ స్టార్ హీరోలు. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయ్. రెండు సినిమాల్లోనూ ఎట్ ఏ టైమ్ షూటింగ్స్‌లో పాల్గొంటోంది నిధి అగర్వాల్.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సౌకర్యార్ధం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ‘హరి హరవీరమల్లు’ షూటింగ్ జరుగుతుండగా, అదే రోజు హైద్రాబాద్‌లో ‘రాజాసాబ్’ షూటింగ్ కూడా జరుగుతోంది. ఒకే రోజు రెండు సినిమా షూటింగ్స్‌లోనూ పాల్గొన్న నిధి అగర్వాల్.. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమైందని సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆడియన్స్‌తో పంచుకుని సంతోషం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







