డ్రై ఫ్రూట్స్ అధికంగా తింటున్నారా.?
- October 18, 2024
శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంలో డ్రై ఫ్రూట్స్ చాలా ఉపకరిస్తాయ్. అయితే, డ్రై ఫ్రూట్స్ తినడానికి ఓ పద్ధతి వుందని నిపుణులు చెబుతున్నారు.
పద్ధతీ పాడూ లేకుండా డ్రై ఫ్రూట్స్ తినేవారిలో ఆరోగ్యం కాదు కదా.. అనారోగ్య సమస్యలే ఎక్కువగా తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువగా రాత్రి పూట కొందరిలో డ్రై ఫ్రూట్స్ తినే అలవాటుంటుంది. ఆ అలవాటున్న వాళ్లు ఈ విషయాల్ని గమనించుకోవాలి.
డ్రై ఫ్రూట్స్లోని పోషకాలు శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంతో పాటూ, రోగ నిరోధక శక్తినివ్వడంలో తోడ్పడతాయి.
అయితే, ఉదయం పూట కానీ, లేదంటే మధ్యాహ్నం పొట్ట ఖాళీగా వున్న సమయంలో మాత్రమే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అంతేకానీ రాత్రి పూట డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే, అవి అరిగించుకోవడం చాలా కష్టమని చెబుతున్నారు.
అంతేకాదు, రాత్రి పూట డ్రై ఫ్రూట్స్ తినేవారిలో అజీర్తి సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అంతేకాదు, బరువు సమస్యలతో పాటూ, మలబద్ధకం వచ్చే ప్రమాదం కూడా పొంచి వుంది.
అందుకే అతి సర్వత్రా వర్జ్యయేత్ అంటారు కదా పెద్దలు. తినే మోతాదు సక్రమంగా వుండాలి. అలాగే తినే సమయం కూడా. తస్మాత్ జాగ్రత్త.!
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







