‘బిగ్’ ఫైట్: పృద్వీ వెర్సస్ మణికంఠ నువ్వా - నేనా.?

- October 18, 2024 , by Maagulf
‘బిగ్’ ఫైట్: పృద్వీ వెర్సస్ మణికంఠ నువ్వా - నేనా.?

బిగ్‌బాస్‌ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత పరిస్థితులు మారిపోయాయ్. వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్, ఒరిజినల్ కంటెస్టెంట్స్‌ని రెండు టీమ్‌లుగా విడదీసి బిగ్‌బాస్ టాస్కులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

టాస్కులే కాదు, రెండు టీమ్‌ల మధ్య అన్ని రకాలా బేధాలూ, విబేధాలూ వుంటూ వస్తున్నాయ్. ఆ సంగతి అటుంచితే, తాజా ఎపిసోడ్‌లో ఒరిజినల్ క్లాన్‌కి సంబంధించిన మణికంఠ, పృద్వీ కుమార్ మధ్య పెద్ద రచ్చ జరిగింది.

చిన్నగా చిరు జల్లుగా స్టార్ట్ అయిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. నువ్వెంత .? నీ బతుకెంత.? అని మణికంఠ, పృద్వీని అనేంత వరకూ చేరింది. ఒకానొక టైమ్‌లో ఇద్దరూ కొట్టుకునేవరకూ ఈ గొడవ చేరింది.

మిగిలిన కంటెస్టెంట్ల జోక్యం చేసుకుంటే తప్ప గొడవ కొలిక్కి రాలేదు. అందుకు కారణం పృద్వీనే. కేవలం ఇప్పుడు మణికంఠ మీదే కాదు, మొన్న అవినాష్ మీద కూడా పృద్వీ ఇలాగే విరుచుకు పడ్డాడు.

ఈజీగా నోరు జారేస్తున్నాడు అందరి మీదా. అరే, ఒరేయ్ అనే పిలుపు అవతలి వాళ్లకు కూడా కంఫర్టబుల్ అయితేనే వాడాలి. కానీ, పృద్వీ ఈజీగా అనేస్తూ అవతలి వ్యక్తుల్ని హర్ట్ చేస్తున్నాడు.

ఆటిట్యూడ్ చూపిస్తూ అగ్రెసివ్‌గా వుంటున్నాడు. తొలి నుంచీ ఇదే ఆటిట్యూడ్‌తో పృద్వీ వున్నాడు. మధ్యలో నాగార్జున వార్నింగ్‌తో కాస్త తగ్గినట్లుగా కనిపించినప్పటికీ అదే ఆటిట్యూడ్ కంటిన్యూ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దాంతో హౌస్ మేట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడాలి ఈ ఆటిట్యూడ్ వున్న పృద్వీని వారాంతంలో మళ్లీ నాగార్జున ఎలా వార్న్ చేస్తాడో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com