T20 ప్రపంచ కప్: విండీస్ పై విజయం…
- October 18, 2024
షార్జా: టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈరోజు జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ పై విజయం సాధించిన న్యూజిలాండ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అయితే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో గెలుపంచుల వరకు వచ్చిన వెస్టిండిస్ జట్టు ఓటమి తప్పలేదు… చివరి బంతి వరకు పోరాడిన మాజీ చాంపియన్ 8 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 128/9 స్కోరు చేసింది. ఓపెనర్లు సుజీ బేట్స్ (26), జార్జియా ప్లిమ్మర్ (33) చెలరేగారు. మిడిలార్డర్‌లో ఇసాబెల్లా గేజ్ (20) పరువాలేదనిపించింది. ఇక విండీస్ బౌలర్లలో డియాండ్రా డాటిన్ (4/22) చెలరేగిపోయింది. అఫీ ఫ్లెచర్ రెండు వికెట్లు, కరిష్మా రాంహరక్, అలియా అలెన్ చెరో వికెట్ తీశారు.
అనంతరం ఛేజింగ్ ప్రారంభించి వెస్టిండీస్ చివరి బంతి వరకు పోరాడింది. డియాండ్రా డాటిన్ (33) టాప్ స్కోరర్ గా నిలిచింది. అయితే న్యూజిలాండ్ జట్టు తమ బలమైన బౌలింగ్ అండ్ ఫీల్డింగ్‌తో వెస్టిండీస్‌ను అదుపుచేయగలిగింది. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 120/8 పరుగులకు పరిమితమైంది. కాగా, ఆదివారం జరిగే ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ జట్లు మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్ కోసం పోరును అమీతుమీ తేల్చుకోనున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!









