‘గంగవ్వ 2.0’ బిగ్ ఇంప్రూవ్‌మెంట్.!
- October 19, 2024
గంగవ్వ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. యూ ట్యూబర్‌గా బోలెడంత పాపులారిటీ దక్కించుకున్న గంగవ్వకు బిగ్‌బాస్ గేమ్ షోతో ఆ పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్‌బాస్ మరియు హోస్ట్ నాగార్జున ఇచ్చిన ఊతంతో ఆర్ధికంగానూ గంగవ్వ బాగా బలపడింది.
ప్రస్తుతం బిగ్‌బాస్ 8 వ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కంటెస్టెంట్స్‌లో భాగంగా గంగవ్వకీ బిగ్‌బాస్ సెకండ్ ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటిసారి బిగ్‌బాస్‌లో గంగవ్వ సర్వైవ్ కాలేకపోయింది.
దాంతో, హఠాత్ ఎలిమినేషన్ జరిగి ఆమెని హౌస్ నుంచి ఆమె హౌస్‌కి పంపించేశారు బిగ్‌బాస్ నిర్వహకులు. అయితే, ఇప్పుడు గంగవ్వ 2.0. పూర్తి కాన్ఫిడెన్స్‌తో హౌస్‌లోకి అడుగు పెట్టింది.
మిగిలిన కంటెస్టెంట్లను జడ్జ్ చేయడంలో కానీ, నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, చాలా చురుకుతనం, తెలివి తేటలు ప్రదర్శిస్తోంది.
టాస్కుల్లోనూ తాను ఆడగలిగినవి కాన్ఫిడెంట్‌గా ఆడేస్తోంది. నామినేషన్లలో తెలివిగా డిఫెండ్ చేసుకుంటోంది. లేటెస్ట్‌గా మెగా ఛీప్ ఎంపిక విషయంలోనూ గంగవ్వ తీసుకున్న డెసిషన్ హ్యాట్సాఫ్ అనేలా వుంది.
ఎటువంటి మొహమాటం లేకుండా స్ట్రెయిట్‌గా కంటెస్టెంట్లను ప్రశ్నించడంలో కానీ, నిలదీయడంలో కానీ గంగవ్వ తనదైన ముద్ర వేస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌లో మెగా ఛీఫ్ కంటెండర్ కావడానికి గట్టి పోటీనే ఇచ్చింది. చివరికి గౌతమ్ మెగా ఛీఫ్‌గా ఎంపిక కాబడ్డాడు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







