VD 12 స్టేటస్ ఏంటంటే.!
- October 19, 2024
‘ఫ్యామిలీ స్టార్’ సినిమా తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం తొలిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు విజయ్ దేవరకొండ. ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇంతవరకూ ఈ సినిమా కేరళలో షూటింగ్ జరుపుకుంది. అక్కడ కొన్ని కీలకమైన యాక్షన్ ఘట్టాలతో పాటూ, కొన్ని పాటలు కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్‌గా కేరళ షూటింగ్ పూర్తి చేసుకుంది విజయ్ దేవరకొండ అండ్ టీమ్. దీంతో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
మిగిలిన భాగం హైద్రాబాద్, వైజాగ్ లోకల్ పరిసరాల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట. వచ్చే నెలలో అందుకు ఏర్పాట్లు చేయనున్నారనీ తెలుస్తోంది. 2025లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







