అరబ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌.. టాప్ ర్యాంకుల్లో ‘సుల్తాన్ ఖబూస్’..!!

- October 19, 2024 , by Maagulf
అరబ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌.. టాప్ ర్యాంకుల్లో ‘సుల్తాన్ ఖబూస్’..!!

మస్కట్: సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం 2025 సంవత్సరానికి QS ర్యాంకింగ్‌లో అరబ్ విశ్వవిద్యాలయాలలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇందులో 7 ఒమానీ విశ్వవిద్యాలయాలతో సహా 271 నమోదిత అరబ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దీనిపై  అసిస్టెంట్ వైస్ ఛాన్సలర్,  ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ అయిన హర్ హైనెస్ సయ్యిదా డాక్టర్ మునా బింట్ ఫహద్ అల్ సయీద్ హర్షం వ్యక్తం చేశారు. సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం గ్లోబల్ ర్యాంకింగ్‌కు ఉపయోగపడే ఉత్తమ పద్ధతులను వర్తింపజేయడంలో విశ్వవిద్యాలయం స్థిరత్వం, నిరంతర అభివృద్ధి ప్రాముఖ్యతను తెలియజేశారు.  ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో విశ్వవిద్యాలయం స్థానాన్ని పెంపొందించడానికి ఇది దోహదం చేస్తుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. తారిఖ్ బిన్ ముహియుద్దీన్ బిన్ ముహమ్మద్ గులామ్ తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com