బద్వేల్ బాలిక ఘటన పై సీఎం చంద్రబాబు సీరియస్..
- October 20, 2024
అమరావతి: కడప జిల్లా బద్వేల్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాలిక మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం తీవ్ర వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు ప్రాణాలు విడిచింది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించిన విఘ్నేశ్ అనే యువకుడు.. శనివారం నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూతూ మృత్యువుతో పోరాడి ఓడింది.
బాధితురాలిని గోపవరం మండలంలోని సెంచురీ ప్లైవుడ్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లిన విఘ్నేశ్.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం రంగంలోకి దిగిన నాలుగు పోలీసు బృందాలు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ కేసు వివరాలను కడప జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు మీడియాకు తెలిపారు. ”ఆ పాప.. పెళ్లి చేసుకోవాలని విఘ్నేశ్ ను అడిగింది. ఇష్టం లేకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటా అని విఘ్నేశ్ అన్నాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పాపపైన పెట్రోల్ పోసి నిప్పంటించాడని తెలిసింది. వెంటనే మూడు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. నిందితుడి కోసం గాలించాడు. అతడి పేరెంట్స్ ఎవరో కనుక్కుని, డీటైల్స్ అన్ని తెలుసుకున్నాము. ఇవాళ 12 గంటల సమయంలో కడప శివారులో నిందితుడిని పట్టుకున్నాం. బాలిక ఏదైతే వాంగ్మూలం ఇచ్చిందో విఘ్నేశ్ కూడా అదే చెప్పాడు” అని కడప జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







