ఒమన్ పోస్టల్ సర్వీసెస్ చట్టంలో కీలక మార్పులు..!!

- October 22, 2024 , by Maagulf
ఒమన్ పోస్టల్ సర్వీసెస్ చట్టంలో కీలక మార్పులు..!!

మస్కట్: తపాలా సేవలను నియంత్రించే చట్టానికి రెగ్యులేటరీ అథారిటీ (TRA) కీలక మార్పులు చేసింది. తపాలా సేవల రంగంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధితో పోటీ పడేందుకు నిర్ణయం తీసుకుంది. ఇది లబ్ధిదారులకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఇ-కామర్స్ టెక్నాలజీలను తాజాగా ప్రవేశపెట్టారు. ముసాయిదా నియంత్రణ చట్టం..తపాలా సేవలను అందించడానికి అవసరమైన లైసెన్స్‌లను పొందేందుకు ఆసక్తి ఉన్న పార్టీల నిబంధనలు, షరతులను నిర్దేశించింది.   ఆధునిక పరిణామాలకు అనుగుణంగా అనువైన నియంత్రణ వాతావరణాన్ని నెలకొల్పడం, లబ్ధిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (SMEలు) సాధికారత కల్పించడం, స్థానిక సంస్థలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను కొత్తగా తీసుకొచ్చినట్లు అథారిటీ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com